వర్క్​ ఫ్రం ట్రాఫిక్.. నిజమేనండీ.. ఈ వార్త చదవండి

వర్క్​ ఫ్రం ట్రాఫిక్.. నిజమేనండీ.. ఈ వార్త చదవండి

వర్క్​ ఫ్రం ట్రాఫిక్​.. టైటిల్​ చూడగానే ఆశ్చర్యపోయారా..? ఫొటో చూస్తే ఐడియా వచ్చే ఉంటుందే.. టెక్​ ఇండస్ట్రీతో నిత్యం రష్​గా ఉండే బెంగళురులో ఓ వ్యక్తి  తీసిన వీడియో కథా కమామిషే ఇది.  భారత్​లో నగరాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా ట్రాఫిక్​ సమస్యలు మాత్రం నిత్యకృత్యమయ్యాయి. ఐటీ ఇండస్ర్టీస్​ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

బెంగళూరులోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో పని చేస్తున్న మహిళ రోజూ మాదిరిగానే ర్యాపిడో బుక్​ చేసి ఆఫీస్​కి వెళ్తోంది. కోరమంగళ, అగార, ఔటర్​రింగ్​రోడ్​ స్ర్టెచ్​ ప్రాంతానికి రాగానే ఓ చెట్టు కూలిపోయింది. దీంతో ట్రాఫిక్​నిలిచిపోయింది. ఆ వనితకు ఆఫీస్​ టైం అవుతోంది. ఆ పరిస్థితుల్లో మనముంటే సాధారణంగా ఏం చేస్తాం..  ట్రాఫిక్​లో చిక్కుకుపోయాం అని బాస్​కి చెప్పి ఊరుకుంటాం. కానీ ఆమె అలా చేయలేదు.. ట్రాఫిక్​లో ఉన్నా తన పనికి ఆలస్యమవుతుందని తెలిసి.. స్కూటీపైనే ల్యాప్​టాప్​ ఆన్​ చేసింది. తన వర్క్​ చేసుకుంటూ పనిలో నిమగ్నమైంది.

ఈ సీన్​ని ఓ నెటిజన్​ వీడియో తీసి ట్విటర్​లో ఉంచాడు. పని పట్ల ఆమెకు ఉన్న శ్రద్ధను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.