ఐటీ ఉద్యోగులు స్పెషల్ కోర్సుల్లో చేరుతున్నారు

ఐటీ ఉద్యోగులు స్పెషల్ కోర్సుల్లో చేరుతున్నారు
  • కొత్త టెక్నాలజీ తెలిస్తేనే …. ప్రమోషన్లు, జీతాల పెంపు
  • స్పెషలైజ్డ్‌కోర్సుల వైపుఐటీ ఉద్యోగుల చూపు
  • ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల చూపు కొత్త స్కిల్స్‌‌ వైపు
  • ఐటీ ఉద్యోగులు స్పెషల్ కోర్సుల్లో చేరుతున్నారు

బెంగళూరు: ఇన్‌‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీల ఉద్యోగులు స్పెషలైజ్డ్ కోర్సులలో జాయిన్ అవుతున్నారు. కంపెనీలు ఆర్టిఫిర్టిషియల్ ఇంటెలిజనెన్స్(ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీ స్కిల్స్ ఉన్నవారికే రివార్డులను, జీతాల పెంపును ఆఫర్ చేస్తుండటంతో, ఉద్యోగులు ఈ కోర్సులలో ఎన్‌‌రోల్ అవుతున్నారు. ఉద్యోగాలు, జీతాలపై టీమ్‌లీజ్ విడుదల చేసిన రిపోర్ట్ లో ‌‌ కరోనా మహమ్మారితో ప్రస్తుతం జీతాల గ్రోత్ ‌‌ఎక్కడిక్కడే స్తంభించింది. ‘సూపర్ స్పెషలైజ్డ్’ ప్రొఫైల్స్‌ ‌ఉన్న కొందరికే కంపెనీలు ఇంక్రిమెంట్‌‌ను 15 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. డిజిటల్‌‌లో స్పె షలైజ్డ్ స్కిల్స్ ఉన్న వారికి 10 శాతం వరకు జీతాలను పెంపును చేపడుతోన్న కంపెనీల్లో ఐటీ, టెక్నాలజీ స్టార్టప్ లున్నాయని టీమ్‌లీజ్ రిపోర్ట్ తెలిపింది. ఏప్రిల్ నుంచి 50 వేల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్‌‌ ‌‌సెక్యూరిటీ వంటి ఎమర్జిం గ్ టెక్నాలజీ కోర్సుల్లో జాయిన్ అయినట్టు ఎడ్‌ టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ పేర్కొంది. అంతేకాక జిగ్‌‌షా అకాడమీ కూడా 5 వేల మంది ప్రొఫెషనల్స్ స్పెషలైజ్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ఎన్‌‌రోల్ అయినట్టు తెలిపింది.

ఎమర్జింగ్ టెక్నాలజీల్లో స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపు 20 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నట్టు జిగ్‌‌షా అకాడమీ సీఈవో, కోఫౌండర్ గౌరవ్ వోహ్రా తెలిపారు. భవిష్యత్‌‌లో అవసరం పడే స్కిల్స్ కేవలం కెరీర్‌‌‌‌ను ప్రమాదంలో పడేయకుండా కాపాడటమే కాకుండా.. ఇండస్ట్రీలో ఇనొవేషన్‌‌కు, ట్రాన్స్‌‌ఫార్మేషన్‌‌కు ఉపయోగపడతా యని పేర్కొన్నారు. ఎమర్జిం గ్ టెక్నాలజీస్ కోర్సుల్లో రిజిస్టర్ కావడం ఏడాది లెక్కన 200 శాతం వరకు పెరిగిందని ఎంటర్‌‌‌‌ప్రైజ్ ఐటీ ట్రైనింగ్ ప్రొవైడర్ స్పింగ్‌‌ పీపుల్ చెప్పింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ కో ర్సులను 3 వేల మంది తీసుకుంటున్నారని, సైబర్ సెక్యూరిటీ కోర్సును 3 వేల మంది ఎన్‌‌రోల్ చేసుకు న్నట్టు చెప్పింది. ఈ కోర్సులను పూర్తి చేసిన తర్వాత, వేతన పెంపు, ప్రమోషన్, టీమ్స్‌‌లో గుర్తింపు వంటి వాటిల్లో తాము బాగా లబ్ది పొందినట్టు 95 శాతం లెర్నర్స్‌‌ చెప్పినట్టు స్పింగ్‌‌ పీపుల్ ఫౌండర్, సీఈవో రవి కాకసరియా తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీ ల్లో శిక్షణ పొందడం ఇప్పుడు కేవలం ఒక అసెట్ మాత్రమే కాదని, అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో మనుగడ సాధించడానికి ఉద్యోగులకు తప్పనిసరిగా ఈ స్కిల్స్ కావాలని చెప్పారు.