తిరుపతి జిల్లా: స్వర్ణముఖి నది ఒడ్డున పేకాట హంగామా.. డ్రోన్ తో గుర్తించిన పోలీసులు.. పోలీసుల అదుపులో నిందితులు

తిరుపతి జిల్లా:  స్వర్ణముఖి నది ఒడ్డున పేకాట హంగామా.. డ్రోన్ తో  గుర్తించిన పోలీసులు.. పోలీసుల అదుపులో నిందితులు

తిరుపతి .. తిరుమల.. శ్రీకాళహస్తి ఈ పేర్లు వింటేనే ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది.   తిరుపతి జిల్లా స్వర్ణముఖీ నది పవిత్ర నది ప్రవహిస్తుంది.  ఈ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమాలు.. అఘాయిత్యాలు.. అసాంఘిక కార్యకలాపాలు.. చట్ట వ్యతిరేక పనులు జరుగకుండా అధికారులు.. పోలీసులు చర్యలు తీసుకుంటారు.  డ్రోన్​ సాయంతో  ఈ ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు.    

తిరుపతి జిల్లా పోలీసులు  డ్రోన్​ సాయంతో పర్యవేక్షిస్తుండగా..  - కొట్ర మంగళం సమీపంలో స్వర్ణముఖి నదీఒడ్డు పేకాట రాయుళ్లను గుర్తించారు. - తిరుపతి జిల్లా ఎస్పీ  ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ   రవి మనోహరాచారి పర్యవేక్షణలో, రేణిగుంట డీఎస్పీ  వై. శ్రీనివాసరావు  ఆధ్వర్యంలోతొమ్మిది మంది  అక్రమ పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి  పేక ముక్కలు, 12 వేల 400 రూపాయిలు, 10 మొబైల్ ఫోన్లు, ఐదు  మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు.

 నిందితులపై  గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.