స్మార్ట్ ఫోన్ వినియోగంతో యువతలో తగ్గుతున్న క్రియేటివిటీ

స్మార్ట్ ఫోన్ వినియోగంతో యువతలో తగ్గుతున్న క్రియేటివిటీ

మామూలుగా పిల్లలు, యువకుల్లో మిగతా వాళ్లకన్నా క్రియేటివిటీ కొంత ఎక్కువుంటుంది. అయితే, తాజా అధ్యాయనాల ప్రకారం వీళ్లలో క్రియేటివిటీ తగ్గుతున్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. దీనికి కారణం.. కరోనా వల్ల పిల్లలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. దాంతో కాలక్షేపం కోసం స్మార్ట్ ఫోన్లు పట్టిన పిల్లలకు అదే వ్యసనంగా మారింది. ఆ వ్యసనం పిల్లల మెదడుపై ప్రభావం చూపి, క్రియేటివిటీని తగ్గిస్తుంది. చైనాకు పరిశోధకులు జరిపిన న్యూరోఇమేజింగ్ పరిశోధనలో ఈ విషయం బయటికి వచ్చింది.

ఈ రీసెర్చ్ గురించి సోషల్ కాగ్నిటివ్ అండ్ ఎఫెక్టివ్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురితం అయింది. రీసెర్చర్ జినీ లీ, అతని టీం సభ్యులంతా 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయసున్న 48 మంది స్టూడెంట్స్ పై స్మార్ట్ ఫోన్ అడిక్షన్ స్కెల్ (ఎస్ ఎ ఎస్) టెస్ట్ లు చేశారు. ఆ టెస్ట్ లో విద్యార్థులకు ఆల్టర్నేటివ్ యూజెస్ టాస్క్ లు ఇచ్చి వాటిని సాల్వ్ చేయమన్నారు. మొబైల్ ఫోన్ అతిగా వాడేవాళ్లు టాస్క్ లను పూర్తి చేయలేకపోయారు. మిగితా వాళ్లు వాటిని సులభంగా పూర్తి చేసి హై స్కోర్ చేశారు.