నేటికి పార్లమెంట్పై దాడి జరిగి 21 ఏళ్లు

నేటికి పార్లమెంట్పై దాడి జరిగి 21 ఏళ్లు

ఢిల్లీ : భారత పార్లమెంట్ పై దాడి జరిగి 21 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమరులైన జవాన్లకు పార్లమెంట్ దగ్గర నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కఢ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇతర నేతలు అమర జవాన్లకు నివాళులర్పించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీతో పాటు ఇతర నేతలు కూడా నివాళులర్పించారు. 

2001 డిసెంబర్ 13న పాకిస్థాన్ కు చెందిన రెండు టెర్రర్ గ్రూపులు పార్లమెంట్ పై దాడి చేశాయి. టెర్రరిస్టుల దాడిలో 14మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత జవాన్లు ఎదురు కాల్పులు జరిపి 9 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే.