ఐటీ హబ్​తో 750 మందికి కొలువులు : కవిత

ఐటీ హబ్​తో 750 మందికి కొలువులు : కవిత

నిజామాబాద్ :  రాష్ట్రంలో కలలుగన్న ప్రగతి సాధ్యమౌతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.  జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్ పనులను పరిశీలించిన ఆమె త్వరలోనే ఐటీ హబ్ను మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా  ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో 750 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని  అన్నారు. ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.  త్వరలో ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయని, ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. మరోవైపు జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత చెప్పారు.