
సంగారెడ్డి: చట్టవ్యతిరేకంగా బెల్ట్ షాప్‌లు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాల్సింది పోయి బాధితులపై కేసులు నమోదు చేయడం దారుణన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో 13 మంది దళిత కుటుంబ సభ్యులను జగ్గారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..పోలీసులు అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం దారుణమన్నారు. మారేపల్లిలో శాంతియుత వాతవరణం నెలకొనేలా చూడాలని గ్రామ పెద్దలకు ఆయన సూచించారు. మారేపల్లి ఘటన లో కొండాపూర్ సీఐ, ఎస్.ఐ అత్యుత్సాహం కారణంగా పరిస్థితి చేయి దాటి పోయిందన్నారు. కౌన్సిలింగ్ చేసి గొడవ ను సద్దుమనిగెలా పోలీసులు చేయాల్సింది ఉండేదన్నారు. కానీ అలా చేయక అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అనంతరం జైలుకు పంపడం దారుణమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.