భారత్లో 10 కోట్ల స్మార్ట్​ఫోన్​ యూజర్లు

భారత్లో 10 కోట్ల స్మార్ట్​ఫోన్​ యూజర్లు

న్యూఢిల్లీ: మన దేశంలో 5 జీ వినియోగం వేగంగా జోరందుకుంటుందని అంచనా వేస్తున్నారు. 10 కోట్ల స్మార్ట్​ఫోన్​ యూజర్లు ఇండియాలో ఉన్నారు. వీరిలో 5 జీ ఫోన్లు ఉన్నవారిలో చాలా మంది 2023లో 5 జీ సర్వీసులకు అప్​గ్రేడ్​ చేసుకుంటారని గ్లోబల్​ టెలికం జెయింట్​ ఎరిక్సన్​ చెబుతోంది. ఇండియన్​ మొబైల్​ కాంగ్రెస్​ (ఐఎంసీ) సందర్భంగా ఇటీవలే దేశంలో 5 జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 5 జీ ఎక్విప్​మెంట్​కు డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో తమ తయారీ సామర్ధ్యాన్ని కూడా పెంచుకుంటున్నట్లు పేర్కొంది. నెట్​వర్క్​ల కోసం అవసరమయ్యే ఏఐఆర్​ 3219, ఏఐఆర్​ 3268  ఎక్విప్​మెంట్​ ఇందులో ఉన్నాయని వివరించింది. ఈ రేడియోలను ఇంటిగ్రేటెడ్​ నెట్​వర్క్స్​లో వినియోగిస్తారు. పుణెలో 4 జీ, 5 జీ ఎక్విప్​మెంట్​ తయారు చేసే తమ  ప్లాంట్​ కెపాసిటీని విస్తరిస్తున్నట్లు ఎరిక్సన్​ వెల్లడించింది. కొత్తగా తయారు చేసే ఎక్విప్​మెంట్​ను అమర్చడం చాలా సులభంగా ఉంటుందని పేర్కొంది. మొబైల్స్​లో క్లౌడ్​ గేమింగ్​ వేగంగా ఎదగనుందని చెబుతూ, ఇందుకోసం తాము తెచ్చిన నెట్​వర్క్​ స్లైసింగ్​ ఫీచర్​ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఫీచర్​ను ఐఎంసీలో కంపెనీ ప్రదర్శించింది కూడా.  మొబైల్​ గేమర్లకు  యూజర్​ ఎక్స్​పీరియన్స్​ మెరుగ్గా ఉండేలా ఈ ఫీచర్​ సాయపడుతుందని వివరించింది.

జియో, ఎయిర్​టెల్​ల నుంచి ఆర్డర్లు....
రిలయన్స్​ జియో, భారతి ఎయిర్​టెల్​ల నుంచి 5 జీ నెట్​వర్క్​ ఎక్విప్​మెంట్​ కోసం ఆర్డర్లను చేజిక్కించుకున్నట్లు కూడా ఎరిక్సన్​ వెల్లడించింది. ఈ రెండు టెలికం కంపెనీలూ ఎరిక్సన్​ ఎక్విప్​మెంట్​నే వాడనున్నాయి. వీ (వోడాఫోన్​ ఐడియా)తో కూడా ఎరిక్సన్​ డిస్కషన్స్​ జరుపుతున్నట్లు సమాచారం. ఇండియాలో 5 జీ రెడీ స్మార్ట్​ఫోన్లు ఉన్న వారి సంఖ్య గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు ఎరిక్సన్​ పేర్కొంది. అమెరికా, యూకేలలో కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువని వివరించింది. అర్బన్​ కస్టమర్లకు మంచి ఎక్స్​పీరియన్స్​ కలిగించే 5 జీ టెక్నాలజీ, దేశం తన డిజిటల్​ ఇన్​క్లూజన్​ గోల్స్​ చేరుకోవడానికీ సాయపడుతుందని ఎరిక్సన్​ నెట్​వర్క్​ సొల్యూషన్స్​ హెడ్​ నితిన్​ బన్సల్​ చెప్పారు.వచ్చే ఏడాదిలో 10 కోట్ల మంది 5 జీ నెట్​వర్క్​ వినియోగదారులవుతారని ఎరిక్సన్​ రిపోర్టు అంచనా వేస్తోంది. మెరుగైన డేటా సర్వీసెస్ దొరికేటట్లయితే ఎక్కువ రేట్ల ప్లాన్​లకు మారడానికి  5 కోట్ల మంది రెడీ అయినట్లు ఈ ​ రిపోర్టు వెల్లడించింది. ఇప్పుడు 4 జీ ప్యాక్స్​ కోసం చెల్లించే మొత్తం కంటే దాదాపు 45 శాతం ప్రీమియం చెల్లించడానికి ఆ కస్టమర్లు సిద్ధమవుతున్నట్లు వివరించింది. 

సర్వీస్​ క్వాలిటీ ఇంపార్టెంట్​....
ఏ సర్వీస్​ ప్రొవైడర్​ మెరుగైన 5 జీ సర్వీస్​ ఇస్తే ఆ ప్రొవైడర్​వైపు మళ్లేందుకు కస్టమర్లు సిద్ధంగా ఉన్నారని, మొబైల్​ ఆపరేటర్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలని ఎరిక్సన్​ రిపోర్టు సూచించింది. 5 జీతో ఫిక్స్​డ్​ వైర్​లెస్​ యాక్సెస్​ సర్వీసులూ రానున్నట్లు పేర్కొంది. వైర్డ్​ హోమ్​ బ్రాడ్​బ్యాండ్​ సర్వీసులకు ఆల్టర్నేటివ్​గా దీనిని వాడొచ్చని తెలిపింది. జియో ఎయిర్ ఫైబర్​ పేరిట ఇలాంటి సర్వీసులు తేనున్నట్లు రిలయన్స్​ జియో ఇప్పటికే ప్రకటించింది.