ఇష్టాలు కలిస్తేనే...

ఇష్టాలు కలిస్తేనే...

రిలేషన్​షిప్​ ఏదైనాఎక్కువ రోజులు కంటిన్యూ అయినా,  బ్రేక్​ అయినా దాని వెనక కారణాలు చాలా ఉంటాయి. అందుకే రిలేషన్​షిప్​లోకి అడుగుపెట్టడానికి ముందే కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటున్నారు ఈ జనరేషన్​. వాళ్లు ‘బెటర్​హాఫ్​.ఎఐ’ అనే మ్యాట్రిమొనీ యాప్​ 22 నుంచి 29 ఏళ్లున్న 225 మందిపై ఈ మధ్య ఒక సర్వే చేసింది.  లైఫ్​ పార్ట్​నర్​ని సెలక్ట్ చేసుకోవడంలో ఇద్దరి ఇష్టాలు, అభిప్రాయాలు కలవడం చాలా ముఖ్యమని ఈ సర్వేలో పార్టిసిపేట్​ చేసిన 83 శాతం మంది చెప్పారు. ఫ్యామిలీ బ్యాక్​గ్రౌండ్​ బాగుండాలని పదిశాతం మంది అభిప్రాయపడ్డారు. జాతకాలు కలవాలి, కులం, మతం ఒకటే అయి ఉండాలి అని ఐదు శాతం మంది చెప్పారు. మిగతా మూడు శాతం మంది ప్రొఫెషన్ ఏది?​ జీతం ఎంత? అనేవి చూస్తామని అన్నారు. పెళ్లి తర్వాత విడిగా కాకుండా అమ్మానాన్నతో కలిసి ఉండేందుకు ఎక్కువమంది అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారట. పెళ్లిచూపులు, అమ్మాయి, అబ్బాయిల అమ్మానాన్నలు టీ, కాఫీ తాగి మాట్లాడుకుని  పెళ్లి సంబంధాలు ఖాయం చేసుకునే రోజులు తగ్గిపోయాయి”అంటున్నారు ‘బెటర్​హాఫ్.ఎఐ’ ఫౌండర్, సిఇవో​ పవన్​ గుప్తా.