ప్రతి మగాడూ రేపిస్ట్ అని అనడం సరైనది కాదు

ప్రతి మగాడూ రేపిస్ట్ అని అనడం సరైనది కాదు
  • మ్యారిటల్ రేప్ అంశంపై మంత్రి

న్యూఢిల్లీ: ప్రతి పెండ్లి హింసాత్మకమైనదని, ప్రతి మగాడూ రేపిస్ట్ అని అనడం సరైనది కాదని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ మినిస్టర్ స్మృతి ఇరానీ అన్నారు. దేశంలోని మహిళలు, పిల్లల రక్షణ ముఖ్యమైన అంశమని.. అలా అని అలాంటి విమర్శలు చేయడం కరెక్టు కాదని అన్నారు. బుధవారం రాజ్యసభలో మ్యారిటల్ రేప్ అంశంపై సీపీఐ లీడర్ బినోయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3, ఐపీసీలోని సెక్షన్ 375పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దానిపై సభలో ఇంతకుమించి మాట్లాడలేనని ఇరానీ చెప్పారు. కాగా, మ్యారిటల్ రేప్ ను నేరంగా భావించాలని కేంద్రం అనుకుంటోందా? అని బీజేపీ లీడర్ సుశీల్ మోడీ ప్రశ్నించారు. అలా చేస్తే వివాహ వ్యవస్థ నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భార్య ఇష్టం లేకుండానే భర్త సెక్స్ లో పాల్గొన్నాడని నిరూపించడం కష్టమవుతుందన్నారు.