
ముషీరాబాద్, వెలుగు: అన్ని రంగాల్లో వెనుకబడుతున్న ఎరుకల జాతి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఎరుకల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవం పోచయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో 12 కోట్లు, తెలంగాణలో 3 లక్షల మంది ఎరుకల జనాభా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లికట్టే విజయ్ కుమార్ గౌడ్, వలిగి ప్రభాకర్, గరిక శ్రీనివాస్, నరహరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.