గ్రాండ్​గా ఐటీ మినిస్టర్​ బర్త్​డే సెలబ్రేషన్

గ్రాండ్​గా ఐటీ మినిస్టర్​ బర్త్​డే సెలబ్రేషన్

మహాముత్తారం/మల్హర్, వెలుగు:  జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్​బాబు బర్త్​డేను గురువారం కాంగ్రెస్​ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కేక్​కట్​ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్  అధ్యక్షుడు పక్కల సడవలి, జడ్పీటీసీ లింగమల్ల శారద దుర్గయ్య,  లీడర్లు తాటి లచ్చయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అలాగే  మల్హార్​లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బడితల రాజయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దండు రమేశ్​ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జడ్పీటీసీ ఐత కోమల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వల్లెంకుంట, కొయ్యూరు గ్రామాల ఉపాధి హామీ కూలీలందరికి మజ్జిగ ప్యాకెట్ ల పంపిణీ చేశారు.