పాతబస్తీలో ఐటీ దాడులు..

పాతబస్తీలో ఐటీ దాడులు..

హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ దాడుల కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షా నవాజ్ పై రెండు సార్లు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పుడు షా నవాజ్ దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన దుబాయ్ నుంచి వచ్చాక ఐటీ అధికారులు మరోసారి తనిఖీ చేపట్టారు. షా నవాజ్ సమక్షంలోనే ఆయన ఇళ్లు కార్యాలయాల పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది.