మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్.. మిగతా కాలేజీలు అలర్ట్!

మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్.. మిగతా కాలేజీలు అలర్ట్!

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి కాలేజీలపై ఇన్ కమ్ ట్యాక్స్ సోదాలతో మిగతా కాలేజీ యజమాన్యాలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు వసూలు చేసిన కాలేజీలు తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. డొనేషన్ల విషయం ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దని.. అలా చెబితే కాలేజీకి, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవన్నట్లుగా  తల్లిదండ్రులకు ఫోన్ చేసి  చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇంజినీరింగ్ కాలేజీల్లో డొనేషన్లు కట్టి సీట్లు తీసుకున్న తల్లిదండ్రులకు.. ఇలా కాలేజీల నుంచి ఫోన్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని.. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డొనేషన్ల గురించి అడిగితే చెప్పొద్దని సూచనలు చేస్తున్నారు. కంప్యూటర్ కోర్సులకు కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు లక్షల్లో డొనేషన్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదంతా లెక్కల్లోకి రాని డబ్బులే అని అంటున్నారు. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలైతే 3 లక్షల నుంచి 15 లక్షల దాకా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.