తెలుగు రాష్ట్రాల్లో వీ కేర్ సీడ్స్ పై ఐటీ సోదాలు..

 తెలుగు రాష్ట్రాల్లో  వీ కేర్ సీడ్స్ పై ఐటీ సోదాలు..

తెలుగు రాష్ట్రాల్లో  ఐటీ సోదాలు కలకలం రేపుతోన్నాయి.  పప్పు దినుసుల హోల్ సేల్ వ్యాపారులపై సోదాలు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

అక్టోబర్ 7న ఉదయం నుంచి ఏపీ, తెలంగాణలోని పది చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.  మహబూబ్ నగర్, గుంటూరులో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ ..హైదరాబాద్ లోని  కొండాపూర్, కూకట్ పల్లి ప్రాంతాలలో సోదాలు చేస్తోంది. కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకట్ రెడ్డి  అనే వ్యక్తి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.  వి కేర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ధూళిపాళ్ల వెంకట్రావు ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 

ALSO READ :  పీఎంఓ నకిలీ అధికారి పై కేసు.. రంగంలోకి సీబీఐ

హైదరాబాద్ తో పాటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో వెంకట్రావుకు చెందిన ఫ్యాక్టరీలు, గోడౌన్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నూల్ లోని వి సీడ్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి .  వీ కేర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వెంకట్రావు తో పాటు మరో  ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.  వ్యవసాయ విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలను విక్రయాలు చేస్తోంది వి కేర్ సీడ్స్. అయితే ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉండడంతో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. 2009 నుంచి వెంకట్రావు వీ కేర్ సీడ్స్ నడిపిస్తున్నారు.  గతంలో  కూడా హైకోర్టులో  వి కేర్ సీడ్స్ పై కేసు నమోదయ్యింది.