ఎన్నికల్లోపు స్టార్టయ్యేనా! ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులపై మళ్లీ కదలిక

ఎన్నికల్లోపు స్టార్టయ్యేనా! ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులపై మళ్లీ కదలిక

ఎన్నికల్లోపు స్టార్టయ్యేనా!
ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులపై మళ్లీ కదలిక
రూ.4300  కోట్లతో 36 పనులకు ప్రపోజల్స్ 
ఏడాది తర్వాత మళ్లీ సవరించి పంపిన బల్దియా 
 ఈ నెలాఖరులోపు సర్కార్ నిర్ణయం తీసుకునే చాన్స్
 జీవో ఇచ్చినా టెండర్లకు 6 నెలల సమయం
డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు 
 సిటీ ఓటర్లకు గాలం వేసేందుకేనా..?

హైదరాబాద్, వెలుగు :  స్ట్రాటజిక్ రోడ్​ డెవలప్ మెంట్​ప్లాన్(ఎస్ఆర్డీపీ)ఫేజ్–2 పనులపై కదలిక వచ్చినట్టు కనిపిస్తుంది.  ఏడాది కింద పంపిన బల్దియా ప్రపోజల్స్‌‌ కు సవరణలు చేసి పంపాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు తాజాగా రూ.4,300 కోట్లతో 36 రకాల పనులు చేసేందుకు మరోసారి సవరించిన ప్రతిపాదనలు పంపించారు. 

నెలాఖరులోపు నిర్ణయం 

ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులపై ప్రభుత్వం ఈ నెలాఖరులోపు నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా అనుమతులు ఇచ్చినా పనులు స్టార్టయ్యే అవకాశం లేదు.  ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని సెకండ్ ఫేజ్ లో  ఒక్క పని మొదలయ్యే అవకాశం లేదని ఎక్స్ పర్ట్స్​ చెబుతున్నారు.  జీవో వచ్చిన తర్వాత పనులకు సంబంధించిన డీపీఆర్ తో పాటు  టెండర్లు పూర్తి చేసేందుకు  ఆరు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. 

జీవో ఇచ్చినా కష్టమే..

సెకండ్ ఫేజ్ పనులకే పరిపాలన అనుమతులు ఇచ్చినా ఇప్పటికప్పుడు పనులు ప్రారంభమయ్యే అవకాశమే లేదు. జీవో వచ్చిన తర్వాత పనులకు సంబంధించిన డీపీఆర్ తో పాటు  టెండర్ల పూర్తికి ఆరునెలలకుపైగా టైమ్ పట్టొచ్చు. దీంతో ఎన్నికలలోపు కూడా పనులు స్టార్ట్ చేయడం కష్టమే. ఫేజ్ –2 కి కూడా అనుమతులు ఇచ్చామని, ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని ఎన్నికల ప్రచారంలో సిటీ ఓటర్లకు గాలం వేసేందుకు కనిపిస్తుంది. అయితే.. ఎస్​ఆర్ డీపీ పనులకు సంబంధించి అసెంబ్లీతో పాటు సమావేశాలు జరిగిన కూడా మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో  మేయర్ తో పాటు అధికార కార్పొరేటర్లు ఏళ్లుగా పదేపదే చెబుతున్నారు. కానీ కొత్త పనులపై చెప్పడంలేదు. ఇప్పుడు వచ్చిన కదలికతోనైనా ప్రభుత్వం అనుమతులిస్తే బాగుంటుందని జనం కోరుతున్నారు.

ఇవే సెకండ్ ఫేజ్​ పనులు 

సెకండ్ ఫేజ్ లో  స్కై వేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ తదితర పనులు చేపట్టనున్నారు.  ఉప్పల్​జంక్షన్ ఫ్లై ఓవర్, కూకట్ పల్లి  వై జంక్షన్,  బండ్లగూడలో ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి–నానల్‌‌నగర్‌‌లో మల్టీ లెవల్ అండర్‌‌పాస్, ఫలక్ నుమా ఆర్ వోబీ, కుత్బుల్లాపూర్‌‌లో ఫాక్స్ సాగర్ పైప్‌‌లైన్‌‌పై వంతెన నిర్మాణం, ఖాజాగూడలో సొరంగం, మాణికేశ్వర్ నగర్ ఆర్ యూబీ, చిలకలగూడ లో ఆర్​యూబీ, ఆరాంఘర్‌‌లో రెండు రూబిల నిర్మాణంతో పాటు ఇంకొన్ని పనులు చేయనున్నారు. ఈ  పనులు పూర్తయితే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతాయి.