కర్నాటక తరహాలో ప్రచారం చేయాలి : కేసీ వేణుగోపాల్

కర్నాటక తరహాలో ప్రచారం చేయాలి :  కేసీ వేణుగోపాల్

హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక తరహా ప్రచార వ్యూహాన్ని అవలంబించాల ని రాష్ట్ర కాంగ్రెస్  నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  సూచించారు. ఆదివారం జరిగే టీపీసీసీ ప్రచార కమిటీ రెండో సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఆయన హైదరాబాద్‌‌  వచ్చా రు. ఏఐసీసీ ఇన్​చార్జి మాణిక్‌‌రావ్​ ఠాక్రే, పీసీసీ చీఫ్  రేవంత్‌‌  రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్  మధుయాష్కీ  గౌడ్ తదితరు లు ఎయిర్‌‌‌‌ పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు. 

అనంతరం గాంధీ భవన్‌‌లో పార్టీ నేతలతో వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఆ వివరాలను పొలిటికల్ ఎఫైర్స్  కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్  గెలవడానికి వేణు గోపాల్​ పలు సూచనలు చేశారని తెలిపారు.  ట్రైబల్ డే రోజు తండాల్లో బస చేయాలని నిర్ణయించామని చెప్పారు. 

ఆగస్ట్ 15 నుంచి నెల రోజుల వ్యవధిలో జహీరాబాద్, మహబూబ్‌‌నగర్‌‌‌‌, నల్గొండ పార్లమెంట్  పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో సభకు ఒక్కో ముఖ్య నేత హాజరవుతారన్నారు. రాష్ట్రంలో భూముల స్కామ్​పై చార్జిషీట్  వేస్తామని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు.