Shoaib Malik: విడాకులు ఏకపక్షం! షోయబ్ పెళ్లిపై సానియా మీర్జా తండ్రి కీలక వ్యాఖ్యలు

Shoaib Malik: విడాకులు ఏకపక్షం! షోయబ్ పెళ్లిపై సానియా మీర్జా తండ్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్(41) మరోసారి ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా(37)తో తన బంధాన్ని తెంచుకున్న ఈ క్రికెటర్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను మనువాడాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మేము ఒక్కటయ్యాము.. అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. 

షోయబ్ మాలిక్ తన వివాహానికి ముందు సానియాకు విడాకులిచ్చారని తెలిపిన ఇమ్రాన్ మీర్జా.. షరియా చట్టాల ప్రకారం ఇది ఏకపక్ష నిర్ణయమని వెల్లడించారు. 'ఖులా' ద్వారా విడాకులు తీసుకున్నారని వెల్లడించారు. ఖులా అనేది ఇస్లామిక్ చట్టాల ప్రకారం.. స్త్రీ తన భర్త నుండి ఏకపక్షంగా విడాకులు తీసుకోవచ్చు. అంటే,  అతని మాటలను బట్టి సానియానే మొదట తన బంధాన్ని తెంచుకోవడాని సిద్ధపడిందని స్పష్టమవుతోంది.

ప్రేమ వివాహం

2010లో మొదట భార్య అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్ అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2018లో ఇజాన్ అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడిపోతున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై వీరు ఏనాడూ స్పందించింది లేదు. అవన్నీ పుకార్లే అనేలా పైకి కనపించేవారు. ఈ మధ్యనే ఈ జంట తమ కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఇంతలోనే ఏమయ్యిందో కానీ, షోయబ్ మరొకరిని పెళ్లాడానని చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.