
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా మారిన రిద్ది కుమార్.. లవర్, అనగనగా ఓ ప్రేమకథ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’లో ఓ కీలక పాత్ర పోషించింది. త్వరలో ఈ సినిమా రిలీజవుతున్న సందర్భంగా ఆమె తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘మాది పుణె. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. నేను ఫిలాసఫీలో డిగ్రీ చేశాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో అటువైపు అడుగులు వేశాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్ లాంటి స్టార్‌తో పని చేసే చాన్స్ రావడం ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ విమెన్ క్యారెక్టర్. దీనికోసం నేను ఆర్చరీ నేర్చుకున్నాను. నా పర్‌ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. మేలో స్ట్రీమింగ్‌కి వస్తుంది. రేవతిగారు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కాజోల్‌కి కూతురిగా నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు చేతిలో ఉన్నాయి. డిటెక్టివ్ పాత్రలు, ఫన్నీగా ఉండే క్యారెక్టర్స్ ఇష్టం నాకు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలందరితో నటించాలనుంది’ అని చెప్పింది.