
వండే కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత రోహిత్ శర్మ సైలెన్స్ బ్రేక్ చేశాడు. బ్లాస్టింగ్ కామెంట్స్ తో క్రికెట్ కమ్యూనిటీలో పెద్ద చర్చకు దారితీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో గంభీర్ పాత్ర ఏమీ లేదని.. ఆ క్రెడిట్ అంతా రాహుల్ ద్రవిడ్ కే వెళ్తుందని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాక మార్పులు వచ్చినట్లు కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశాడు రోహిత్. ద్రవిడ్ పదవీ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు.. టీమ్ లో నింపిన స్పిరిట్, ఐడియాలజీ ఈ రోజు టీమ్ ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అన్నారు.
2023 వండే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమి తర్వాత.. రోహిత్, ద్రవిడ్ సారథ్యంలో టీమిండియా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఆ తర్వాత టీమ్ కోలుకుని 2024 T20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి సత్తా చాటింది.
ఇండియా టీమ్ ప్రస్థానం ఒక రోజు ఒక ఏడాదితో వచ్చింది కాదని.. కొన్ని ఏళ్ల తరబడి వేసిన ఫౌండేషన్ అని రోహిత్ అన్నాడు. చాలా సార్లు గెలుపుకు దగ్గరగా వెళ్తామని.. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవని రోహిత్ అన్నాడు. ముంబై లో జరిగిన CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ సందర్భంగా.. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ కి సన్నద్ధమవుతున్న క్రమంలో.. టీమిండియాలో స్థైర్యాన్ని నింపి.. ప్లేయర్ల ఎంపికలో రాహుల్ ద్రవిడ్ తీసుకున్న నిర్ణయం.. రెండు వరుస ట్రోఫీలు గెలుచుకునేందుకు తోడ్పడిందని చెప్పాడు రోహిత్.