30 డేస్.. రేవంత్ రెడ్డి మార్క్

30 డేస్.. రేవంత్ రెడ్డి మార్క్

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఇవాళ్టికి(జనవరి 07) నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్క్ కనిపిస్తున్నది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్నిట్లోనూ మార్పు కనిపిస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్త సర్కార్ వచ్చినంక తేడా ఉందని భావిస్తున్నారు. పాలనపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మార్క్ చూపిస్తున్నారంటున్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి పాలనలో మార్పు తెచ్చారని.. అలాగే సెక్రటేరియట్ లో వరుస రివ్యూలు చేస్తున్నారని తెలిపారు. మంత్రులు కూడా తమ శాఖలపై సమీక్షల్లో పాల్గొంటున్నారు. అధికారులు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 

గతంలో డిప్యూటీ సీఎం అంటే పేరుకే తప్ప.. ఇంకేం ఉండదన్న మార్క్ కూడా పోయింది.  బీఆర్ఎస్ టైమ్ లో ఏం చేసినా అంతా సోలోగా అప్పటి సీఎం క్రెడిట్ లో పడిపోయేదన్న విమర్శలున్నాయి. పదేళ్ల తర్వాత కొత్త సర్కార్ పాలనలో అంతా కొత్తగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.