ఉల్లిపాయలు.. ధర పెరుగుతుంది. రాబోయే రోజుల్లో భారీగా ధర పెరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను విధించింది. దీంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానికంగా.. మన దేశంలో ఉల్లి ధరలను కంట్రోల్ చేయటానికి ఎగుమతులపై ఆంక్షలు విధించటం ద్వారా.. ఉల్లి రైతులు నష్టపోతున్నామంటూ మహారాష్ట్ర రైతులు రాష్ట్ర మంత్రిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి దాదా భూషే కీలక వ్యాఖ్యలు చేశారు.
అటు రైతులు.. ఇటు కొనుగోలుదారులను ఉద్దేశించి మంత్రి దాదా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. 10 లక్షల రూపాయలు పెట్టి కారు కొంటారు.. ఏం 10, 20 రూపాయలు ఎక్కువ ధరతో ఉల్లి కొనుగోలు చేయలేరా అంటూ ప్రశ్నించారు. ఉల్లి ధరలు ఎక్కువ అనే వాళ్లు.. రెండు, మూడు నెలలు ఉల్లిపాయలు తినొద్దు.. తినకపోతే ఏం కాదు కదా.. ఉల్లి తినకపోతే చస్తారా ఏంటీ అంటూ వ్యాఖ్యానించారు.
ALSO READ : జర్నలిస్టులకు ఎలన్ మస్క్ ఆఫర్ : ఎక్స్ (X)లో రాయండి.. డబ్బులు సంపాదించుకోండి
మంత్రి దాదా రెండు వైపులా మాట్లాడిన మాటలతో.. ఆందోళన చేస్తున్న ఉల్లి రైతులు సైతం సెలైంట్ అయ్యారు. వెటకారంగా అన్నారని అనుకున్నా.. ఆయన అన్నదాంట్లో పాయింట్ ఉంది కదా అంటున్నారు నెటిజన్లు. లీటర్ పెట్రోల్ వంద రూపాయలతో కొంటున్నారు.. 10, 20 లక్షల కార్లు కొంటున్నారు.. నెలా, రెండు నెలలపాటు ఉల్లి పాయలను 10, 20 రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేరా అనేది కూడా పాయింటే కదా.. ఇక ఆ మాత్రం కొనుగోలు చేయలేని సామాన్యులు ఉల్లి తినకపోతే ఏమీ కాదు కదా అనేది కూడా పాయింటే కదా అంటున్నారు నెటిజన్లు.
ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. 90 శాతం మంది సామాన్యులు, మధ్య తరగతి వాళ్లు ఉన్న దేశంలో.. రోజూ తినే ఉల్లిపాయల విషయంలో ధర కంట్రోల్ లో ఉండాలి కదా.. తినకపోతే ఏమీ కాదుగా అంటున్నారు.. మీరు ఉల్లి లేని కూర తినగలరా మంత్రి గారూ అంటున్నారు సామాన్యులు.