ఫైనల్ మ్యాచ్కు కీపర్గా అతడైతేనే బెటర్ : సునీల్ గవాస్కర్

ఫైనల్ మ్యాచ్కు కీపర్గా అతడైతేనే బెటర్ : సునీల్ గవాస్కర్

బోర్డర్ గవాస్కర్ ట్రీఫీలో టీమిండియా గెలిచినా కొన్ని విభాగాల్లో మాత్రం నిరాశ పరిచింది. నిలకడలేక టాప్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడుతుంటే జట్టు టాప్ స్కోర్ చేయలేక పోతుంది. అంతేకాకుండా కీపర్ విషయంలో కూడా సీనియర్ ప్లేయర్ ఉంటే మంచిదని కొందరు ఎక్స్ పర్ట్స్ టీం సెలక్టర్లకు సలహాలు ఇస్తున్నారు. జూన్ 7 న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉన్న క్రమంలో సునీల్ గవాస్కర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా కేఎస్ భరత్  స్థానంలో సీనియర్ ప్లేయర్  కేఎల్ రాహుల్ ని ఆడించాలని సూచించాడు.

‘జట్టులో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ లాంటి మంచి వికెట్ కీపర్లు ఉన్నారు. కానీ, ఆస్ట్రేలియా లాంటి జట్టును ఫైనల్ లో ఎదుర్కోవడం అంటే జూనియర్లకు కాస్త ఇబ్బంది ఉంటుంది. ఒత్తిడికి లోనవుతారు. దాంతో  వాళ్లనుంచి జట్టుకు కావాల్సిన ప్రదర్శన అందదు. ఇలాంటి ఈవెంట్స్ లో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా అది మంచిది కాదు. అందుకే ఎక్స్ పీరియన్స్ ఉన్న వికెట్ అయితే మంచిదని నా అభిప్రాయం. జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నాడు. భరత్ స్థానంలో రాహుల్ ని ఆడితే ఫైనల్ లో గెలిచే అవకాశాలు ఎక్కు్వ’ అని గవాస్కర్ అన్నాడు.