అందర్నీ ప్రేమించాలన్నదే ‘అలయ్ బలయ్’ ఉద్దేశం

అందర్నీ ప్రేమించాలన్నదే ‘అలయ్ బలయ్’ ఉద్దేశం
  • కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్

హైదరాబాద్: దసరా సందర్భంగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఇతివృత్తంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా తీయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కోరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ మంచి సంస్కృతి సంప్రదాయాలు  కలిగిన రాష్ట్రం అని అన్నారు. దత్తన్న ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు నుండి మనం ప్రేరణ పొందాలని సూచించారు. మన వాళ్లనే కాదు అందరిని ప్రేమించాలనే తత్వం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని వివరించారు. మనుసులంతా ఒక్కటే అని సిద్ధాంతాన్ని అందరూ పాటించాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కోరారు.