రోమ్: ఇటలీ చరిత్రలో తొలిసారి మహిళకు ప్రధాని పదవి దక్కనుంది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన రైట్ వింగ్ నేత జార్జియా మెలోనీ(45) ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఈమధ్యే జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతం ఓట్లను గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 104 కాగా ఆ కూటమికి 114 సీట్లు దక్కనున్నాయి. దీంతో ఆమె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరో వారం పట్టవచ్చని, మెలోనీ ప్రధాని హోదాలో తొలి పార్లమెంట్ అక్టోబర్ 13న మొదటిసారి సమావేశమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
