
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ గ్రూపు ఐటీసీ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు నాలుగు రెట్లు పెరిగి రూ.19,807.8 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.5,013.18 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం దాదాపుగా రూ.20,376.3 కోట్లకు చేరుకుంది.
ఇది గత నాలుగో క్వార్టర్లో రూ.20,349.9 కోట్లుగా ఉంది. 2024–-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి, కంపెనీ లాభం 68.9 శాతం పెరిగి రూ.35,052 కోట్లకు చేరుకుంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.20,751 కోట్లు ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం 10.4 శాతం పెరిగి రూ.81,612.78 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో సాధారణ షేరుకు రూ. 7.85 ఫైనల్ డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.