చిరుధాన్యాలు పండించాలి: ఐటీడీఏ పీవో

చిరుధాన్యాలు పండించాలి: ఐటీడీఏ పీవో

తిర్యాణి, వెలుగు: చిరుధాన్యాలు పండించి రైతులు ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సూచించారు. వాసన్ ఎల్ఐసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తిర్యాణి మండలంలోని గుడిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్లను పరిశీలించారు.

 రైతులకు పంటలపై  అవగాహన కల్పించారు. మహిళా సంఘాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించేలా, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లకు సప్లై చేసేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో బోర్​వెల్ ​మంజూరు చేయాలని స్థానికులు పీవోకు వినతిపత్రం అందజేశారు. ఐటీడీఏ ఏఈ  బద్రుద్దిన్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.