విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలి : ఐటీడీఏపీవో యువరాజ్ మర్మాట్

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలి :  ఐటీడీఏపీవో యువరాజ్ మర్మాట్

జైనూర్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఇన్​చార్జి యువరాజ్ మర్మాట్ టీచర్లకు సూచించారు. గురువారం జైనూర్ మండలం రాశిమెట్ట గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు), భూశిమెట్ట గిరిజన గురుకులం కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, తరగతి గదులు, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీటిని పరిశీలించారు. 

అనంతరం యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు నిత్యం పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలో వందశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా నివారణకు చర్యలు చేపట్టాలని, చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు వేడి నీళ్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.