
ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఐటెల్ 16 జీబీ ర్యామ్‌తో ఎస్23 స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ ద్వారా లాంచ్ చేసింది. దీని ధర రూ. 8,799. రిటైల్ అవుట్‌లెట్‌ల కోసం ప్రత్యేకంగా 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఎస్23లో 50 ఎంపీ వెనుక కెమెరా, ఫ్లాష్‌తో కూడిన 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.6 ఇంచుల స్క్రీన్, 1.6 గిగా హెజ్ అక్టాకోర్ ప్రాసెసర్, 4జీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.