డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది టీమ్. అక్కినేని నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే ఫైండింగ్ అర్జున అనే స్పెషల్ వీడియో మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఓ సరదా ప్రోమోను విడుదల చేసింది. పియానోపై ఓ ట్యూన్ వాయించేందుకు అనీష్ ప్రయత్నిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాఫీ మగ్ చేతిలో పట్టుకుని అతన్ని ఆసక్తిగా గమనిస్తుంటాడు.
అనీష్ వాయిస్తున్న ట్యూన్‌ను చూసి సరదాగా ఆటపట్టించాడు తమన్. ఫైనల్‌గా ఈ చిత్రంలోని మొదటి పాటను మే 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిత్రంలో హీరో పాత్ర చెవిటి, మూగ యువకుడు కావడంతో సంగీతం కథలో మరింత కీలక పాత్ర పోషించనుందని మేకర్స్ తెలియజేశారు.
