నవంబర్ 11న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్

నవంబర్ 11న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్

'నాంది' మూవీ తరువాత హీరో అల్లరి నరేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఇప్పటికే  టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లతో ఆకట్టుకున్న  ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. చిత్ర ట్రైలర్  ను నవంబర్ 11 న రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు.  ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

కొత్త దర్శకుడు ఆర్ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  రాజేష్ దండ, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఇందులో అల్లరి నరేశ్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా కనిపిస్తు్ండగా, అతని సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. నవంబరు 25న ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.