ఐటీఆర్-2 ఆన్‌‌లైన్ ఫైలింగ్‌‌ ప్రారంభం

ఐటీఆర్-2 ఆన్‌‌లైన్ ఫైలింగ్‌‌ ప్రారంభం

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ 2026-27 అసెస్​మెంట్​ సంవత్సరం ఆన్‌‌లైన్ ఐటీఆర్–-2 దాఖలు చేసే సదుపాయాన్ని ఈ-ఫైలింగ్ పోర్టల్‌‌లో అందుబాటులోకి తెచ్చింది. ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆన్‌‌లైన్ విధానంతో పాటు ఎక్సెల్ యుటిలిటీని కూడా ప్రారంభించింది. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఎలాంటి ఆదాయం లేకుండా, కేవలం పెట్టుబడి లాభాలు పొందే వ్యక్తులు, హెచ్​యూఎఫ్​లు ఐటీఆర్-–2 ఫైల్ చేయాలి.

మధ్యతరహా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫైలింగ్ సదుపాయాన్ని ఈనెల 15న అందుబాటులోకి తెచ్చారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఆడిటింగ్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు ఆగస్టులోలోపు  ఐటీఆర్-4 దాఖలు చేయాలని ఐటీశాఖ తెలిపింది.