అయ్యర్​, జడేజా ఆదుకున్నరు

అయ్యర్​, జడేజా ఆదుకున్నరు
  • అయ్యర్​, జడేజా ఆదుకున్నరు
  • గిల్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌, జడేజా హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు
  • ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 258/4
  • న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌

కాన్పూర్‌‌‌‌‌‌‌‌: టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ను క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసిన టీమిండియా... టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌నూ మంచిగానే స్టార్ట్​ చేసింది. కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ లాంటి సీనియర్లు లేకపోయినా, రహానె, పుజారా లాంటి స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు తక్కువ స్కోర్లకే ఎనక్కి మర్లినా.. కొత్త కుర్రాడు శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (136 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 నాటౌట్‌‌‌‌‌‌‌‌), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (93 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 52), రవీంద్ర జడేజా (100 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 50 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఇండియాను నిలబెట్టారు. దీంతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో గురువారం మొదలైన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 84 ఓవర్లలో 4 వికెట్లకు 258 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో కైల్‌‌‌‌‌‌‌‌ జెమీసన్‌‌‌‌‌‌‌‌ ముగ్గుర్ని, సౌథీ ఒకరిని ఔట్​ చేశారు.


గిల్‌‌‌‌‌‌‌‌ పోరాడిండు..
టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియాను స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ పేసర్లు ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా జెమీసన్‌‌‌‌‌‌‌‌ మంచి లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌తో పాటు బౌన్స్‌‌‌‌‌‌‌‌తో.. ఓపెనర్లను తిప్పలు పెట్టాడు. ఈ ప్రెజర్​ నుంచి గిల్‌‌‌‌‌‌‌‌ బయటపడ్డా.. మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ (13) ఫెయిలయ్యాడు. 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో జెమీసన్‌‌‌‌‌‌‌‌ వేసిన గుడ్‌‌‌‌‌‌‌‌లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌ను తాకి కీపర్‌‌‌‌‌‌‌‌ చేతుల్లో పడ్డది.  దీంతో ఇండియా 21 వద్ద ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ లాసైంది. ఈ టైమ్​లో పుజారా (26) భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడలేకపోయాడు. పేసర్లతో పాటు స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ రన్స్‌‌‌‌‌‌‌‌ తీయలేక ఇబ్బంది పడ్డాడు.  దీంతో ఎక్కువగా స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న గిల్‌‌‌‌‌‌‌‌.. 81 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేశాడు. లంచ్‌‌‌‌‌‌‌‌ వరకు ఇండియా 82/1 స్కోరు చేసింది.కానీ, బ్రేక్​  తర్వాత స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే గిల్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో సెకండ్ వికెట్‌‌‌‌‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి పుజారా, రహానె (35) నిలబడేందుకు ట్రై చేశారు. కానీ జెమీసన్‌‌‌‌‌‌‌‌, సౌథీ.. లో బౌన్స్‌‌‌‌‌‌‌‌తో టెస్టు పెట్టడంతో ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది ఓవర్లు ముగియకముందే పుజారా ఔటయ్యాడు. రహానెతో తను  మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 34 రన్స్‌‌‌‌‌‌‌‌  యాడ్​ చేశాడు. 
 

సూపర్‌‌‌‌‌‌‌‌.. శ్రేయస్‌‌‌‌‌‌‌‌
పుజారా ఔట్‌‌‌‌‌‌‌‌తో డెబ్యూ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ క్రీజులోకి వచ్చాడు. షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు డిఫరెంట్​గా తన షాట్స్‌‌‌‌‌‌‌‌ను, ఫుట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను మార్చుకుంటూ సూపర్​  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో టీమ్​ను ఆదుకున్నాడు.  పాత బాల్‌‌‌‌‌‌‌‌కు పిచ్‌‌‌‌‌‌‌‌ నుంచి పెద్దగా సపోర్ట్​ లేకపోవడంతో  రెండు సెషన్ల పాటు కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లపై కంప్లీట్‌‌‌‌‌‌‌‌ ఆధిపత్యం చూపెట్టాడు. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో జెమీసన్‌‌‌‌‌‌‌‌ మరో దెబ్బ కొట్టాడు. మంచిగా ఆడుతున్న రహానెను.. టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు ముందు లో బౌన్స్‌‌‌‌‌‌‌‌, లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. దీంతో ఇండియా 145/4తో డీలా పడ్డది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సీనియర్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ జడేజా తన ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ చూపెట్టాడు. 154/4తో టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు పోయొచ్చిన  తర్వాత శ్రేయస్‌‌‌‌‌‌‌‌, జడేజా ఇన్నింగ్స్​కు ముందుకు తీసుకుపోయారు. ముఖ్యంగా అయ్యర్​ క్లాసిక్​ బ్యాటింగ్​తో మజా పంచాడు. జెమీసన్‌‌‌‌‌‌‌‌, సౌథీని ఆచితూచి ఆడుతూనే.. మిగతా బౌలర్లలో రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టిండు. అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ లాంగాన్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌కు రెచ్చగొట్టినా, రచిన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో సవాల్​ విసిరినా శ్రేయస్‌‌‌‌‌‌‌‌ ఎక్కడా తగ్గలేదు. రచిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కొట్టిన ల్యాప్‌‌‌‌‌‌‌‌ స్కూప్‌‌‌‌‌‌‌‌ షాట్​ ఫస్ట్​ డే ఆటలో హైలెట్‌‌‌‌‌‌‌‌.ఆఫ్‌‌‌‌‌‌‌‌ బ్రేకర్‌‌‌‌‌‌‌‌ సోమర్‌‌‌‌‌‌‌‌విల్లే కూడా అయ్యర్​, జడ్డూ జోరుకు తేలిపోయాడు. ఈ క్రమంలో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 94 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేశాడు. 68 ఓవర్లలో ఇండియా స్కోరు కూడా 200  దాటింది. 80 ఓవర్ల తర్వాత కొత్త బాల్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా.. కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఈ ఇద్దర్ని విడగొట్టలేకపోయారు. జడేజా 99 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 113 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్​నర్​షిప్​తో  అయ్యర్, జడ్డూ  తొలి రోజు  ఇండియాను మంచి పొజిషన్​లో నిలబెట్టారు. 

ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 84 ఓవర్లలో 258/4 (శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 75*, జడేజా 50*, గిల్‌‌‌‌‌‌‌‌ 52, జెమీసన్‌‌‌‌‌‌‌‌ 3/47, సౌథీ 1/43).