మరో బ్లాక్ బస్టర్ సినిమాలో జాన్వీ కపూర్:

మరో బ్లాక్ బస్టర్ సినిమాలో జాన్వీ కపూర్:

హీరోయిన్ జాన్వీ కపూర్ మరో బ్లాక్ బస్టర్ సినిమాలో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. ఈ మేరకు బోనీ కపూర్ స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో జాన్వీ నటించనుందని బోనీకపూర్ కామెంట్స్ తో స్పష్టం అయ్యింది.

చాలా రోజుల కిందట అనౌన్స్ చేసిన చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ ఆడిషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. నిజానికి జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించనుందని ముందు నుండి గాసిప్స్ ఉన్నప్పటికీ ఆమె దేవర సినిమాతో బిజీ అవ్వటంతో ఈ ప్రాజెక్ట్ లో లేనట్లే అనుకున్నారు.

జాన్వీ త్వరలోనే రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందని బోనీ కపూర్ స్పష్టం చేశాడు. తల్లి శ్రీదేవి లాగే జాన్వీ కూడా చాలా భాషల్లో నటించాలని అనుకుంటుందని బోనీ అన్నాడు. ప్రస్తుతం జాన్వీ తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుందని, త్వరలోనే హీరో సూర్య సరసన కూడా హీరోయిన్ గా నటిస్తుందని తెలిపాడు.