
బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నాడు.
అతడి ఆరోగ్య పరిస్థితిని టీవీ నటుడు నూకరాజు సోషల్ మీడియాలో వెల్లడించాడు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని.. అందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిపాడు. ‘చేతులెత్తి అర్థిస్తున్నా దయచేసి తోచినంత సాయం చేయండి’అంటూ వేడుకున్నాడు.