సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాల మహానాడు నేతలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాల మహానాడు నేతలు

మిర్యాలగూడ, వెలుగు : సీఎంరేవంత్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు చెరుకు రామచందర్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు కలిశారు. మాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్లు మాలలకు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నామినేటెడ్ పదవుల్లో మాల జేఏసీ సభ్యులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మాలల కమ్యూనిటీ బిల్డింగ్​ నిర్మాణానికి హైదారాబాద్ లో  ఐదెకరాల భూమి కేటాయించాలని కోరారు. భాగ్యారెడ్డి వర్మ  కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలన్నారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు, వర్కింగ్ చైర్మన్లు బేర బాలకిషన్, గుడిమల్లె వినోద్, వైస్ చైర్మన్లు నాను, ఎ.రాజ్ కుమార్, కో కన్వీనర్ మద్దెల ప్రభాకర్, యంబే వినోద్ కుమార్, గ్రేటర్ చైర్మన్ ఉత్తం సుమన్, వర్కింగ్ చైర్మన్, సత్యనారాయణ, పాలడుగు శ్రీనివాస్ రాజు తదితరులు ఉన్నారు.