న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి  మొదటి వారంలో  ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో ప్రకటించారు.  ఈ నెల 22న లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2023 అక్టోబర్‌ 14న  సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తప్పక గెలుస్తుందని ఆర్డెర్న్  ధీమా వ్యక్తం చేశారు.

 జెసిండా ఆర్డెర్న్‌ తొలిసారిగా 2017లో న్యూజిలాండ్‌ ప్రధాని పదవిని చేపట్టారు.  భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన లేబర్‌ పార్టీ  తక్కువ సీట్లు సాధించింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్ లో కరోనాను  కట్టడి చేయలేకపోవడం, ఆర్థిక మందగమనం వంటి అంశాల్లో ఆ దేశ ప్రజలకు అర్డెర్న్ పై నమ్మకం తగ్గింది.  దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఓటమి పాలైంది. దీనికి బాధ్యత వహిస్తూ..తాజాగా అర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.