మిగతా మూడు టెస్ట్‌‌‌‌లకు జాక్‌‌‌‌ లీచ్‌‌‌‌ దూరం

మిగతా మూడు టెస్ట్‌‌‌‌లకు జాక్‌‌‌‌ లీచ్‌‌‌‌ దూరం

లండన్‌‌‌‌: ఇండియాతో మిగతా మూడు టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు ఇంగ్లండ్‌‌‌‌ లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ జాక్‌‌‌‌ లీచ్‌‌‌‌ దూరమయ్యాడు. ఎడమ మోకాలి గాయంతో అతను అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లండ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు (ఈసీబీ) ఆదివారం వెల్లడించింది.

రాబోయే 24 గంటల్లో లీచ్‌‌‌‌ అబుదాబి నుంచి ఇంగ్లండ్‌‌‌‌ వెళ్లిపోతాడని తెలిపింది. లీచ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ప్రత్యామ్నాయ ప్లేయర్‌‌‌‌ను ఇంకా ప్రకటించకపోయినా.. స్పిన్‌‌‌‌ త్రయం టామ్‌‌‌‌ హర్ట్‌‌‌‌లీ, రెహాన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, షోయబ్​ బషీర్‌‌‌‌తోనే మిగతా టూర్‌‌‌‌ను కొనసాగిస్తారని తెలుస్తోంది. పార్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గా జో రూట్‌‌‌‌ రాణిస్తుండటం ఇంగ్లండ్‌‌‌‌కు అదనపు బలంగా మారింది.