
- జగద్గిరిగుట్ట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ ఏసీపీ పి.నరేశ్ రెడ్డి జగద్గిరిగుట పీఎస్‌లో బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటకకు చెందిన మహబూబ్(40) ముషీరాబాద్‌లో ఉంటూ స్క్రాప్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతడు రౌడీషీటర్. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి.
ఎల్లమ్మబండకి చెందిన మహ్మద్ ఫజీల్(48), అతడి సోదరుడు ఐదేళ్ల క్రితం మహబూబ్‌కు రూ.11 లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి ఆ డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. మరోసారి అడిగితే చంపేస్తానని ఫజీల్ను మహబూబ్ బెదిరించాడు. దీంతో మహబూబ్‌ను హతమార్చాలని ఫజీల్ నిర్ణయించుకున్నాడు.
ఇందుకు తన మేనల్లుడు సయ్యద్ జహంగీర్(23), జహంగీర్ మిత్రులు షేక్ కరీమ్(23), షేక్ అమీర్(23)ల సాయం తీసుకున్నాడు. వీరంతా మంగళవారం మహబూబ్‌ను మాట్లాడుదామని చెప్పి ఎల్లమ్మబండ వద్ద గుడ్‌విల్ హోటల్‌కు పిలిపించారు. అక్కడికి మహబూబ్ రాగానే ఫజీల్ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. అతడి చనిపోగానే అక్కడి నుంచి పరారయ్యారు. జగద్గిరిగుట్ట, బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులు బుధవారం ఓ వైన్ షాపులో మద్యం సేవిస్తుండగా పట్టుకున్నారు.
డొంక తిరుగుడు సమాధానం..
లోడుపై అనుమానం వచ్చిన యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సంఘటన స్థలానికి చేరుకుని ఇటుక తెచ్చిన వారిని విచారించారు. దీంతో వారు డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. ముందుగా 13 వేల ఇటుక తెచ్చామని, మరోసారి 10 వేలు తెచ్చామని, ఇంకోసారి 8 వేల ఇటుకలు ఉన్నాయంటూ నీళ్లు నమిలారు.
కానీ అవి ఆర్డర్ ఇచ్చిన వాటిలో సగం కూడా లేనట్లు స్పష్టంగా కనిపించింది. పూర్తిగా ఇటుకలు లెక్కించి ఎన్ని ఉన్నాయో చెప్పాలని పట్టుబట్టడంతో లారీ ఓనర్ కాళ్ల బేరానికి వచ్చాడు. తమ మోసం బయట పడిందని గ్రహించి ఎంత ఇస్తే అంతే తీసుకుంటామని చెప్పాడు. రూ.40 వేలు తీసుకొని, తనను క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.