టిప్పర్, లారీ డ్రైవర్లకు కూడా రూ.10 వేలు : సీఎం జగన్ ఫస్ట్ హామీ

టిప్పర్, లారీ డ్రైవర్లకు కూడా రూ.10 వేలు : సీఎం జగన్ ఫస్ట్ హామీ

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్ని జోరుగా ప్రచారం చేస్తుండటంతో రాష్ట్రం రణరంగంగా మారింది. మేమంతా  సిద్ధం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికార ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టో ప్రకటించకపోవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జగన్ తన మొదటి హామీని ప్రకటించారు.

లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటిదాకా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు మాత్రమే వర్తిస్తున్న వాహన మిత్ర పథకం 2024లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూడా వర్తింపజేస్తామని అన్నారు. తిరుపతి జిల్లా చిన్న సింగనమలలో జరిగిన డ్రైవర్లతో ముఖాముఖీ కార్యక్రమంలో జగన్ ఈ ప్రకటన చేశారు. జగన్ ప్రకటనతో లారీ, టిప్పర్ డ్రైవర్లలో ఆనందం నెలకొంది.   

ALSO READ :- శ్రీకాళహస్తిలో ఉద్రికత్త: టీడీపీ అభ్యర్థిపై కత్తితో దాడికి యత్నం