పులివెందులలో జగన్ : వివేకా మృతదేహానికి నివాళి

పులివెందులలో జగన్ : వివేకా మృతదేహానికి నివాళి

కడప : వైఎస్ వివేకానందరెడ్డి హత్యవార్తతో హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందులలో వైఎస్ వివేకా ఇంటి వద్ద ఉంచిన ఆయన మృతదేహానికి జగన్ నివాళులు అర్పించారు. జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా పులివెందుల వచ్చారు. తన బాబాయి మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఇంటి కుటుంబసభ్యుల బాధను పంచుకున్నారు. జరిగిన సంఘటన గురించి తన పిన్ని, తల్లి, ఎంపీ అవినాశ్ రెడ్డితో జగన్ మాట్లాడారు.

ఈ ఉదయం పోలీసులు వైఎస్ వివేకా మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. శవపరీక్షల తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వైఎస్ వివేకా ఇంటివద్దకు అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకున్నాయి.