జగన్కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరతానన్న ఆళ్ల

  జగన్కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరతానన్న ఆళ్ల

 కాంగ్రెస్ లో చేరతారని నడుస్తున్న ప్రచారం పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోతున్నట్టు రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు. వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరతారని అదే రోజు తాను కూడా చేరతానని చెప్పారు. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌లో చేరిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రామకృష్ణారెడ్డి చెప్పారు. 

షర్మిల బాటలోనే తాను నడుస్తానని, తామంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లమేనని ఆర్కే అన్నారు. కాంగ్రెస్ లో ఇంకా ఎంతమంది చేరతారనే విషయం తనకు తెలియదని చెప్పారు. తన సోదరుడు వైసీపీలో ఉంటే తాను మరో పార్టీలో చేరకూడదని ఏమీ లేదని.. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అని ఆర్కే అన్నారు. కుటుంబ బంధాలకు విలువ ఇస్తూనే.. రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.

   కాంగ్రెస్ స్వాతంత్రం రాక ముందు నుంచి ఉన్న పార్టీ అని ఆర్కే అన్నారు.  కాంగ్రెస్,- టీడీపీ కలుస్తాయని తాను భావించడం లేదన్నారు.  మంగళగిరిలో రేపు కచ్చితంగా విపక్ష పాత్ర పోషిస్తానని ఆర్కే వెల్లడించారు. అమరావతి  రాజధానికి వ్యతిరేకంగా ఎప్పుడూ కేసులు వేయలేదని చంద్రబాబు  బలవంతపు భూసేకరణ పైనే కేసులు వేశానని చెప్పారు. -అమరావతి రాజధాని పై కాంగ్రెస్ లో చేరిన తరువాత మాట్లాడతానని అన్నారున. వైఎస్సార్ సీపీ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ లో చేరిన తరువాత ఉద్యమిస్తానని  ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.