బెజవాడ నడిబొడ్డున.. అంబేద్కర్ సామాజిక న్యాయం స్టాట్యూ

బెజవాడ నడిబొడ్డున.. అంబేద్కర్ సామాజిక న్యాయం స్టాట్యూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విజయవాడలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19వ తేదీన ఏపీ సీఎం జగన్ ప్రారంభించనున్నారు.  2021 డిసెంబర్ 21వ తేదీన ఈ విగ్రహానికి శంకుస్థాపన చేయగా...  జనవరి 19న దీనిని ప్రారంభించి సీఎం జగన్ జాతికి అంకితమిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇదే కావడం విశేషం.  

విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 400 కోట్ల రూనాయిల ఖర్చుతో ఏర్పాటు చేసిన విగ్రహం ఎత్తు  125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది. అంటే మొత్తం 210 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో దీనిని నిర్మించగా .. రూ. 400 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల్లో స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. 

 ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన మూడో అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మొదటిది. ప్రపంచ వ్యాప్తంగా  మొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండవది శంషాభాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది.