యువ ఆర్చర్ చికితకు సాయం చేస్తా .. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ హామీ

యువ ఆర్చర్ చికితకు సాయం చేస్తా .. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ హామీ

హైద‌రాబాద్‌, వెలుగు: ఆర్చరీలో సత్తా చాటుతున్న నిరుపేద రైతు కుటుంబానికి చెందిన యంగ్‌స్టర్ తానిపర్తి చికిత రావుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని, ఆమెకు అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ అర్శనప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు హామీ ఇచ్చారు. బుధ‌వారం మాదాపూర్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో జ‌గ‌న్‌ ను చికిత‌, ఆమె తండ్రి శ్రీనివాస‌రావు మ‌ర్యాద‌పూర్వకంగా కలిశారు.

ఈ మధ్య కాలంలో తాను సాధించిన విజ‌యాల గురించి తెలిపిన చికిత, ఆటలో ముందుకెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆర్థిక సమస్యల గురించి జగన్ దృష్టికి తీసుకెళ్లి సహాయం కోరింది. గ‌తేడాది నేషనల్ గేమ్స్‌లో గోల్డ్, నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రెండు సిల్వర్ మెడల్స్‌ సాధించిన చికితకు అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ఆర్చరపైనే ఫోకస్ పెట్టి , బాగా కష్టపడాలని ఆమెకు సూచించారు.