వక్ఫ్ బిల్లుపై జేపీసీకి చైర్మన్​గా జగదాంబికా పాల్

వక్ఫ్ బిల్లుపై జేపీసీకి చైర్మన్​గా జగదాంబికా పాల్

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి బీజేపీ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు జగదాంబికా పాల్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మంగళవారం లోక్​సభ సెక్రటేరియెట్ బులెటిన్ విడుదల చేసింది. వక్ఫ్ సవరణ బిల్లును లోక్ సభలో ఆగస్టు 8న మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు.

అయితే, ఈ బిల్లును ఇండియా కూటమితో పాటు వైసీపీ, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యాంగం, ముస్లింలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించాయి. దీంతో ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో 31 మంది సభ్యులు ఉండగా... లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి10 మందికి చోటు కల్పించారు.