
జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల( ఎలక్టోరల్ కాలేజ్) తో చర్చలు జరిపింది. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేసే పనిలో ఉంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికు సంబంధించి సమాచారం, సామాగ్రిని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది ఈసీ.
జగదీప్ ధన్కడ్ 2022 జులై 16 న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ధన్కడ్ రాజీనామా చేసిన 60 రోజులలోపు అంటే సెప్టెంబర్ 19, 2025లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి నాటికి కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నుకునే అవకాశ ఉంది.
ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తన పదవికి సోమవారం (జులై 21) తన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 22న ఆమోదించారు. ధన్ ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ధన్ ఖడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ధన్ ఖడ్ రాజీనామా ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ధన్ ఖడ్ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారు