మా కుమార్తె వివాహానికి రండి.. రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి దంపతులు

మా కుమార్తె వివాహానికి రండి.. రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి దంపతులు

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దంపతులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిసి శుభలేఖ అందజేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి బొట్టు పెట్టి ఆహ్వానించారు. రాహుల్‌‌‌‌‌‌‌‌ని కలిసిన వారిలో జగ్గారెడ్డి కుమార్తె జయరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా, మంగళవారం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలను కలిసి పెండ్లి పత్రిక అందజేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.