కవిత నాటకం.. సురభినాటకం ఒక్క రోజులో అయిపోదు

కవిత నాటకం.. సురభినాటకం ఒక్క రోజులో అయిపోదు
  • సీరియల్​లా సాగుతూనే ఉంటుంది
  • కేటీఆర్‌.. తండ్రి చాటు బిడ్డ
  •  కాంగ్రెస్ గురించి ఏమీ తెలియదు
  • బీజేపీలో చాలా మంది షార్ట్ కట్ నేతలే
  • కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత  నాటకం, సురభి నాటకం ఒక్క రోజులో అయిపోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి  విమర్శించారు. ఇవాళ   మీడియాతో మాట్లాడుతూ కవిత లిక్కర్ స్కాంను సీరియల్​తో పోల్చారు.  మద్యం కుంభకోణంలో కవిత విచారణ అంశం సీరియల్ లా సాగుతూనే ఉంటుదన్నారు. ఇది ఎప్పటికీ తేలదన్నారు. ఈ సందర్భంగ కేటీఆర్​పై ఆయన విరుచుకుపడ్డారు.  మాజీ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్  సంప్రదాయం తెలుసన్నారు. కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి ఏమీ తెలియదన్నారు. కేటీఆర్‌.. తండ్రి చాటు బిడ్డ అని చురకలంటించారు. మొన్నటి వరకూ ఆయనను  సీఏం కొడుకని.. ఇప్పుడు మాజీ సీఏం కొడుకు అని పిలుస్తున్నారని అన్నారు. ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని జగ్గారెడ్డి తెలిపారు.

 కాంగ్రెస్‌పై కేసీఆర్ ఏమైనా విమర్శలు చేస్తే సమాధానం చెప్పేవాళ్లమన్నారు. కేటీఆర్‌కి ఏం తెలుసని ఆయన మాటలకు రియాక్ట్ కావాలని ప్రశ్నించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ తనకు  కావాలనుకుం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానని చెప్పారు. బీజేపీ తనపై అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. బీజేపీలో చాలా మంది షార్ట్ కట్ నేతలే ఉన్నారన్నారు. ఆ పార్టీ నేతల చరిత్రంతా తనకు తెలుసని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క రోజే సంతోషంగా ఉండేవాడినని.. ప్రస్తుతం రోజంతా సంతోషంగా ఉంటున్నానని చెప్పారు.