టెర్రరిస్టులతో లింక్!: జగిత్యాల వాసిపై దేశద్రోహం కేసు

టెర్రరిస్టులతో లింక్!: జగిత్యాల వాసిపై దేశద్రోహం కేసు

జగిత్యాల: దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న వ్యక్తికి నగదు బదిలీ చేశాడు ఓ జగిత్యాల  వ్యక్తి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయంపై జగిత్యాల జిల్లా మల్లాపూర్ ఎస్సై రవి మీడియాతో మాట్లాడారు. కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెల లింగన్న అనే అతను జమ్మూ కశ్మీర్ కు చెందిన రాకేశ్ అనే వ్యక్తికి రెండు సార్లు మనీ ట్రాన్ స్వర్ చేసినట్లు తెలిపారు. అయితే రాకేశ్ కు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దేశ ద్రోహం కేసు నమోదైందని అన్నారు. దీంతో పాటు ఆర్మీ సమాచారాన్ని అనిత అనే మహిళతో పంచుకున్న విషయంలో రాకేశ్ అరెస్ట్ అనినట్లు తెలిపారు.

రాకేశ్ బ్యాంకు వివరాలను పరిశీలించిన జమ్మూ పోలీసులు లింగన్న అనే వ్యక్తి నగదును బదిలీచేసినట్లు గుర్తించారని చెప్పారు ఎస్సై రవి. ఒక సారి ఐదువేలు మరోసారి నాలుగు వేలు ట్రాన్స్ ఫర్ చేశాడని తెలిపారు. అయితే లింగన్న బావ శ్రీనివాస్ చెప్పినందుకే తాను నగదును బదిలీ చేసినట్లు చెప్పాడు నింధితుడు. శ్రీనివాస్ దుబాయ్ లో ఉంటున్నాడు. అయితే రాకేశ్ కు లింగన్నకు మధ్య సంబంధం గురించి తెలుసుకోవడానికి జమ్మూ పోలీసులు జగిత్యాలకు చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో లింగన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.