జగిత్యాల అడిషనల్ కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్

జగిత్యాల అడిషనల్ కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్

జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందు డ్యాన్స్ వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాలేజీ రోజుల్లో ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో.. చదువులోనే కాదు డాన్స్ లోనూ అదరగొట్టారని  నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  కాలేజ్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో ప్రభుదేవా ముక్కాలా ముక్కాలా పాటకు, అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ లకు మకరందు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల జగిత్యాల అదనపు కలెక్టర్ గా మంద మకరందు  బాధ్యతలు స్వీకరించారు.  సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేటకు చెందిన మంద మకరందు సివిల్స్ లో 110వ ర్యాంకు సాధించారు.